Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 17:11:56
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్స్ లో చాలా సింపుల్ గా ఉంటాడు. సైలెంట్ గా కనిపించినా.. ఆన్ ది సెట్స్ మహేష్ వేసే జోక్స్ ఓ రేంజ్ లో ఉంటాయని వినడమే కానీ.. బైటకు తెలిసినది కష్టమే. అలాగే తనతో పని చేసే టీమ్ ని కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవడం మహేష్ కి అలవాటు.

కానీ సూపర్ స్టార్ తనపై ఓ విషయంలో అనుమానం వెలిబుచ్చాడని అంటున్నాడు కమెడియన్ రోలర్ రఘు. మహేష్ తో కలిసి ఆగడు - అతిథి చిత్రాల్లో నటించాడు రఘు. అదుర్స్ - ఊసరవల్లి లాంటి చిత్రాల్లో ఇతని యాక్టింగ్ కి ఆడియన్స్ నుంచి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక జబర్దస్త్ లో రోలర్ రఘుగా సందడి చేస్తుంటాడు ఈ కమెడియన్. ఇండస్ట్రీలో కూడా మంచి పేరే ఉంది. అయితే.. మహేష్ కి ఇతనిపై వచ్చిన డౌట్ ఏంటంటే.. రఘు మాట్లాడే తెలంగాణ స్లాంగ్.

'నేను సాధారణంగా సెట్స్ లో పూర్తి తెలంగాణ యాసలోనే మాట్లాడుతూ ఉంటాను. అది మహేష్ ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసేది. నీ భాష ఇంత డిఫరెంట్ గా ఉన్నపుడు.. గతంలో నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఎలా పని చేశావని... మహేష్ బాబు అడిగుతూ ఉంటారు' అని చెప్పాడు రోలర్ రఘు. మాస్ దర్శకుడు వివి వినాయక్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిలకు ఇతను మాంచి దోస్త్. ఈ ఫ్రెండ్ షిప్ తో.. మెగాస్టార్ నటిస్తున్న 150వ సినిమాలో కూడా యాక్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,