Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 13:27:09
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు రీసెంట్ గా తన సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం దాదాపు నాలుగు వారాల పాటు అహ్మదాబాద్ లో షూటింగ్ చేసి.. అక్కడ యాక్షన్ పార్ట్ దాదాపుగా ఫినిష్ చేసిన సూపర్ స్టార్.. ఇప్పుడు యూరోప్ టూర్ లో ఉన్నాడు.

మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కలిసి యూరోప్ వెళ్లారు. క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేసి.. న్యూ ఇయర్ పూర్తయ్యే వరకూ ఐరాపాలోని పలు దేశాల్లో చక్కర్లు కొట్టబోతున్నారు. ప్రస్తుతం అయితే.. మహేష్ అండ్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఫోటోకి పోజులు ఇచ్చారన్న మాట. మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత.. కొడుకు గౌతమ్.. కూతురు సితారలే కాకుండా.. మహేష్ బావ అయిన జయదేవ్ గల్లా.. ఆయన కుమారులు కూడా ఫోటోలో కనిపిస్తుంది.

రెండు మూడు రోజుల పాటు స్విట్జర్లాండ్ అంతా టూర్ వేయనున్న మహేష్ అండ్ ఫ్యామిలీ.. ఆ తర్వాత ఇంగ్లండ్ లో ల్యాండ్ అవుతారట. న్యూ ఇయర్ వేడుకలను లండన్ లో జరపుకుంటారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,