Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2016 12:24:55
facebook Twitter Googleplus
Photo

మలయాళం అండ్ తమిళ ఫ్యాన్స్ ఎన్ని సెటైర్లు వేసి ఎన్ని విధాలుగా ట్రాలింగ్ చేసినా కూడా.. తెలుగు ''ప్రేమమ్'' గుడ్ రిజల్టుతో వారందరి నోళ్ళనూ మూయించేసింది. అయితే ఈ విషయంలో నెగెటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఒక క్లాసిక్ ను టచ్ చేస్తున్నాం అంటే ఎవరైనా కూడా అలాగే అంటారని చాలా పాజిటివ్ గా స్పందించారు. కాని ఆయనలో ఉన్నంత పాజిటివిటీ మన మీడియా మనుషుల్లో కూడా లేదు తెలుసా.

నిజం ఏంటంటే.. తొలిసారిగా ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ స్టిల్ ఒకటి లీకైన రోజు గుర్తుందా?? మలయాళం ప్రేమమ్ లో అయితే అనుపమ జుట్టును విరబూసుకుని కనిపిస్తుంది. తెలుగులో మాత్రం ఆమెకు జడ వేయించేశాడు దర్శకుడు చందూ మొండేటి. ఈ విషయంలో చాలామంది తెలుగు మీడియా జర్నలిస్టులు. అనుపమ లుక్ ను నాశనం చేశారు.. ఛ ఛ అంటూ ఎన్నో సెటైరికల్ ట్వీట్లు వేశారు. అంతకాదు.. ఇలాగైతే ఆ సినిమా సోల్ దెబ్బతింటుందని కూడా కామెంట్లు చేశారు. వీళ్లకు చాలామంది తెలుగు అభిమానులు కూడా వంతపాడారులే.

సింగిల్ ఫోటో చూసి కామెంట్ చేయడం మంచిది కాదు.. మొత్తంగా సినిమాను చూశాక కదా మనం మాట్లాడిల్సింది అనే చిన్న లాజిక్ ను మిస్సయ్యి.. అప్పట్లో మనోళ్ళు తెగె సెటైర్లు వేశారు. ఇప్పుడు అదే బ్యాచ్ సినిమా అద్బుతం అమోఘం అఖండం అంటూ చెబుతున్నారు. అది సంగతి.

,  ,  ,  ,  ,