Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2015 17:08:40
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతికి మహేష్‌బాబు సినిమాలు రావడం కామన్‌ అయిపోయింది. ఈమధ్య కాలంలో ఈ ఏడాది మాత్రమే మహేష్‌ సినిమా సంక్రాంతికి రెడీ కాలేదు. వచ్చే సంక్రాంతికి మాత్రం ఫాన్స్‌కి ఆ లోటు వుండకూడదని మహేష్‌ ఇప్పట్నుంచే ప్రణాళిక వేసుకుంటున్నాడు. జులై 10న షూటింగ్‌ ప్రారంభం కానున్న బ్రహ్మూత్సవం చిత్రం ఆరు నూరైనా జనవరి 8న విడుదల అవుతుందట. ఇందులో రెండో ఆలోచనే లేదని, ఖచ్చితంగా రిలీజ్‌ అయి తీరుతుందని బిజినెస్‌ వర్గాలతో చెబుతున్నారట.

సంక్రాంతికి వచ్చే ఇతర భారీ చిత్రాలు ఏంటనేది ఇంకా డిసైడ్‌ కాలేదు. అయితే ఏ సినిమా వచ్చినా, రాకపోయినా.. ఏ హీరో సినిమా రిలీజ్‌ అవుతున్నా సరే బ్రహ్మూత్సవం డేట్‌లో మార్పులు వుండవట. సాధారణంగా తను అనుకున్న డేట్‌ని మార్చే అలవాటు లేని మహేష్‌ 'బాహుబలి' కోసమని శ్రీమంతుడు రిలీజ్‌ని వాయిదా వేసాడు. అలా సంక్రాంతికి ఇంకేదైనా సినిమా రిలీజ్‌ అయితే కనుక తమ ప్లాన్స్‌లో మార్పులుండవని ఇప్పుడే స్పష్టం చేస్తున్నారు. సో ఈసారి మహేష్‌ ఫాన్స్‌కి సంక్రాంతి వారం రోజులు ముందుగానే వస్తుందన్నమాట.

,  ,  ,  ,