Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 14:08:20
facebook Twitter Googleplus
Photo

మొన్నామధ్యన ఒక టీజర్.. తరువాత నిన్న 'మధురం మధురం' అంటూ ఇంకో టీజర్.. హ్యండ్సమ్ గా ఉండే ఒక హీరో.. సింపుల్ కార్పొరేట్ లుక్ లు నడుచుకుంటూ వచ్చి.. అమ్మాయిలందరూ పడిపోయాలా ఒక స్మయిల్ ఇస్తాడు. అంతే. అందరూ నిజంగానే పడిపోయారు. అయితే సినిమా అంతటా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇలాగే ఉండబోతున్నాడా??

సరిగ్గా ''బ్రహ్మోత్సవం'' టీజర్లు చూసిన తరువాత అందరికీ ఇదే సందేహం వచ్చే ఛాన్సుంది. కాని ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా కేవలం క్లాస్ ప్రేక్షకులకు మాత్రమే కాదట. ఇందులో చాలా మాస్ అంశాలను ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సదరు అంశాలను ఇప్పుడే రివీల్ చేయకుండా.. కొన్నింటిని ధియేట్రికల్ ట్రైలర్ లోనూ.. మిగిలినవి వెండితెర మీద డైరక్టుగా చూపిస్తే.. ఆ సస్పెన్స్ తాలూకు కిక్ చాలా స్ర్టాంగ్ గా ఉంటుందని నిర్మాతలు డిసైడయ్యారట. మహేష్ సూచనల మేరకే మరోసారి శ్రీమంతుడు స్టయిల్ లో.. ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

చూస్తుంటే మరోసారి శ్రీమంతుడు టైపులో 80+ కోట్లపై మన సూపర్ స్టార్ కన్నేసినట్లు ఉన్నాడే. మే 7న బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ అవ్వనున్న సంగతి తెలిసిందే

,  ,  ,  ,  ,  ,  ,