Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 16:17:07
facebook Twitter Googleplus
Photo

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన కథానాయకులలో భానుచందర్ ముందువరుసలో కనిపిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉండటం వలన డూప్ లేకుండా భానుచందర్ ఫైట్స్ చేసేవాడు. అప్పట్లో ఆ ఫైట్స్ కొత్తగా ఉండటం వలన యూత్ లో ఆయనకి ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత కాలంలో ఆయన కథాబలం కలిగిన ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాల్లోనూ రాణించాడు.

అయితే తాను హీరో కావాలని భానుచందర్ ఎప్పుడూ అనుకోలేదట. ఆ దిశగా ఆయన ఎప్పుడూ ఆలోచించనేలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడైన ఆయన, తండ్రిలానే సంగీతం పట్ల గల ఇష్టంతో గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. అయితే ఈ విషయంలో ఆయన తల్లి కొంత అసంతృప్తిగా ఉండేదట.

భానుచందర్ ని హీరోగా చూడాలనేది ఆమె కోరిక. ఈ విషయం తెలుసుకున్న భానుచందర్ .. తల్లి కోరికని నెరవేర్చినవాడే నిజమైన కొడుకు అని భావించి ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభించాడు. అలా నటనలో శిక్షణ తీసుకున్న ఆయన ఆ తరువాత పట్టుదలతో కృషిచేశాడు. కథానాయకుడిగా రాణించి కన్నతల్లి ముచ్చట తీర్చాడు.

,  ,