Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Oct-2016 16:05:42
facebook Twitter Googleplus
Photo

జ్యో అచ్చుతానంద సినిమా హిట్టుతో మాంచి ఫామ్ లో ఉన్న శ్రీనివాస్ అవసరాల.. మరో ప్రక్కన తన యాక్టింగ్ టాలెంటును కూడా కాస్త గాట్టిగానే చూపించాలని అనుకుంటున్నాడు. అందులోనూ ఇప్పుడు కమెడియన్ నుండి ప్రమోషన్ తెచ్చుకుని మనోడు హీరో అయిపోయాడు కూడా. ఇకపోతే ఇప్పుడు ఆ సినిమా గురించే డిస్కషన్లు వినిపిస్తున్నాయి.

హిందీలో షాకింగ్ కంటెంట్ తో హిట్టయిన సినిమా ''హంటర్''. ఒక కుర్రాడు సెక్సువల్ ఫాంటసీలకు సంబంధించిన కథ. ఈ సినిమాను తెలుగులో అభిషేక్ పిక్చర్స్ వారు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా శ్రీనివాస్ అవసరాల చేస్తున్నాడు. మనోడి సరసన హీరోయిన్ గా అప్పట్లో రెజీనా అనుకున్నారు కాని.. తరువాత ఆమెను రీప్లేస్ చేశారులే. ఇకపోతే యాంకర్ శ్రీముఖి.. అలాగే హీరోయిన్ మిష్టి చక్రవర్తి మరో ఇద్దరి లీడింగ్ లేడీస్ పాత్రలను పోషిస్తున్నారులే. ఈ సినిమాకు ''సోగ్గాడు'' అంటూ టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారట. ''బాబు బాగా బిజీ'' అనేది టైటిల్ క్రింద క్యాప్షన్ అని తెలుస్తోంది.

ఇటువంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో.. మాంచి రొమాంటిక్ కంటెంట్ తో.. మనోళ్లు సినిమాలో ఫుల్లుగా కామెడీ దట్టించేసి.. శ్రీనివాస్ అవసరాల ఒక చిన్న సైజ్ డిపెండబుల్ కమెడియన్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అది సంగతి.

,  ,  ,  ,