Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Sep-2017 11:01:24
facebook Twitter Googleplus
Photo

ఎక్కడ చూసినా బాలీవుడ్ హీరోలే యాడ్స్ తో బిజీగా ఉండేవారు. సౌత్ హీరోలు మాత్రం యాడ్స్ ని అంత ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. ఎవరో ఒకరిద్దరు చేసినా అవి చిన్న చిన్న యాడ్స్ అయ్యేవి. కానీ ప్రస్తుత రోజుల్లో అలా లేదు. కాస్త పాపులర్ అవుతే చాలు సినిమా హిట్ అయినా కాకపోయినా తారలు యాడ్స్ తో బిజీ అవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు యాడ్స్ చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే అలా సంపాదించే వారిలో హీరో మహేష్ బాబు టాప్ పొజిషన్ లో ఉన్నారు.

ఎక్కడికి వెళ్లినా ఈ హీరోకు ఈ మధ్య ఫాలోయింగ్ చాలా పెరుగుతోంది. మొన్నటి వరకు తెలుగులోనే అనుకుంటే ఇప్పుడు స్పైడర్ తో తమిళులను కూడా ఆకర్షిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ నటించిన కమర్షియల్ యాడ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో యాడ్ ద్వారా చాలా పాపులర్ అయినా మహేష్ ఇప్పుడు చెన్నై సిల్క్స్ కమర్షియల్ యాడ్ లో అదరగొట్టాడు. సింపుల్ గా కనిపిస్తూ ఫ్యామిలీని ఆకట్టుకునే విధంగా మహేష్ చేసిన ఆ యాడ్ చాలా బావుంది అంటున్నారు నెటిజన్స్.

ఇక మహేష్ - స్పైడర్ సినిమాతో ఈ నెల 27న సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే.

,  ,  ,  ,