Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 11:04:14
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మోత్సవం సినిమా పరాజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాతి సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం జూలై నెలాఖరు నుండి మొదలుకానుంది. మొదట జూలై నెల మధ్యలో సినిమా మొదలుపెట్టాలని అనుకున్నా కొన్ని కారణాల రీత్యా సినిమాని నెలాఖరున స్టార్ట్ చేయనున్నారు.
సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్.వి. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,