Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2016 15:25:32
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ హీరో సూర్యతో నటించిన మూవీ 24 ప్రచారం కోసం సమంత బాగానే కష్టపడింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ పబ్లిసిటీ భారం అయితే.. తన భుజాలపైనే వేసుకుంది. ఆ సమయంలో మహేష్ బాబు మూవీ - మహేష్ కూతురు సితార గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది. సాధారణంగా ఒక సినిమా ప్రచారంలో వేరే మూవీ గురించి మాట్లాడరు కానీ.. మహేష్ గురించి ఎప్పుడడగినా చెప్పాల్సిందే అన్నట్లుగా ఉంటారు హీరోయిన్లు.

మహేష్ కూతురు సితారతో కలిసి సమంత కబుర్లు చెబుతున్న ఫోటో ఆన్ లైన్ లో వైరల్ గా స్ప్రెడ్ అయింది. 'సితారతో ఏం మాట్లాడుతున్నారు?' అని శామ్స్ ని అడిగితే.. తన నెయిల్ పాలిష్ కలర్ - బ్రాండ్ గురించి మాట్లాడాతున్నా అన్న సమంత... సితారకు హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం సంచలనంగా మారింది. మరి తన కూతురుకి హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయని ఓ టాప్ హీరోయిన్ కామెంట్ చేస్తే.. దానికి మహేష్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడే తెలిసింది.

'తను సరదాగా అందేమో? సితార చిన్న పిల్ల. తను ఏం అవుతుందో అప్పుడే ఎలా చెప్పగలం. కానీ చాలా హుషారుగా ఉంటుంది. పాటలు కూడా పాడుతుంది. సితార హీరోయిన్ గా మారడం అనే అంశం గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది' అంటూ బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు తన మనసులో మాట చెప్పేశాడు.

,  ,  ,  ,  ,  ,