Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2017 12:30:34
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్ జూన్ 23న వచ్చేయాలి. మనోడు ఇదే తేదీన సినిమా రిలీజ్ చేయడానికి అన్ని విధాలుగా మక్కువ చూపిస్తున్నాడని.. అందుకే దర్శకుడు ఏ.ఆర్.మురుగుదాస్ మీద ప్రెజర్ పెడుతున్నాడని వార్తలొచ్చాయి. అవన్నీ ఏమో తెలియదు కాని.. అసలు చూస్తుంటూ ఈ గూడఛారి సినిమా ఇప్పుడు ఏకంగా దసరా రేసుకు జారుకున్నట్లుంది.

నిజానికి ఈ సినిమాను జూన్ 23న తెస్తున్నాం అంటూ దర్శకుడు మురుగుదాస్ ప్రకటించాడు. కట్ చేస్తే ఆ రోజు రావట్లేదని తెలిసిపోవడంతో.. ఆ చుట్టుపక్కన తమ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు అల్లు అర్జున్ అండ్ నాని. దువ్వాడ జగన్నాథమ్ మరియు నిన్ను కోరి సినిమాలు అప్పుడే రానున్నాయ్. అయితే మహేష్ జూలై లో కూడా కాకుండా.. ఆగస్టు 11న వస్తాడని ఈ సినిమా టీమ్ కొందరు ట్వీట్లు గట్రా చేశారు. కాని చివరకు అప్పుడు కూడా వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదట. అందుకే అక్టోబర్ లో రిలీజ్ అయితే బెటర్ అని ప్లాన్ చేశారంటూ ఇప్పుడు కొత్త టాక్ వినిపిస్తోంది.

మహేష్ అండ్ రకుల్ లీడ్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినా కూడా.. ఇంకా పాటలు పెండింగ్ ఉన్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కు టైమ్ తీసుకుంటోంది. ఈ మధ్యన మహేష్ కు క్లయిమ్యాక్స్ రుచించక పోవడంతో.. ఇప్పుడు కొత్త వర్షన్ కూడా తీస్తారట.

,  ,  ,  ,  ,  ,