Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 09:54:44
facebook Twitter Googleplus
Photo

అసలు సినిమా సబ్జెక్ట్ గురించి ఏమన్నా చూపిస్తాడా? ఇంతకీ ఈ సినిమాలో నిజంగానే ఒక సాలీడు ఉందా? ఉంటే అది పోస్టర్ కు ఎక్కుతుందా? లేదంటే సినిమాలో గూడఛారి అంటున్నారు కాబట్టి.. దేశభక్తి తరహా కాన్సెప్టుతో తొలి లుక్ ఉండబోతుందా? ఇటువంటి అనేక సందేహాలు మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ చుట్టూ తిరుగుతూనే వచ్చాయి. అయితే అవన్నీ ఇప్పుడు పటాపంచలు అయిపోయాయ్. అందరూ అనుకున్నదానికంటే చాలా సింపుల్ గా మహేష్ వచ్చేశాడు.

గడచిన సినిమాల రిజల్టు ప్రభావం కారణంగానో.. ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కాని.. అసలు సినిమా థీమ్ కాస్త కూడా రివీల్ చేయకుండా.. కేవలం ఒక గన్ పట్టుకుని నుంచున్న మహేష్ బాబు ఫోజుతో ఇప్పుడు ఫస్ట్ లుక్ వచ్చేసింది. మహేష్ లుక్ కొత్తగా ఉందని చెప్పలేం కాని.. గతంలో కంటే ఇప్పుడు కాస్త కండల పెంచాడు. ఇక సినిమా పేరును స్పైడర్ అనే కన్ఫామ్ చేసేశారు. ముఖ్యంగా వై అనే అక్షరం దగ్గర సూర్యుడు నుండి వస్తున్న కాంతి కిరణాలు లీక్ అయినట్లు డిజైన్ చేయడం.. హాలీవుడ్ టచ్ ను తలపించింది. కాకపోతే సినిమా థీమ్ గురించి పోస్టర్లో ఏదైనా చెప్పుంటే బాగుండేది. ఇకపోతే మోషన్ పోస్టర్లో మాత్రం మ్యూజిక్ అదిరిపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలోనే ఉంది.

ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ స్పైడర్ సినిమాకు.. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.

,  ,  ,  ,