Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 13:33:24
facebook Twitter Googleplus
Photo

అందాల తారగా దేశవ్యాప్తంగా అభిమానులను మెప్పించిన శ్రీదేవి.. ఇప్పుడు 50 ప్లస్ లో కూడా లీడ్ రోల్ చేస్తూ ఓ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తోంది. శ్రీదేవి నటించిన మామ్ మూవీ జూలై 7న రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో తెగ బిజీగా ఉంది ఈ సీనియర్ బ్యూటీ.

మామ్ చిత్రం #శ్రీదేవి300 వ సినిమా కావడం విశేషం. అందుకే ఈ చిత్రం సక్సెస్ కోసం చాలా జాగ్రత్త పడుతోందిట. ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం సహజమే కానీ.. ఈ మూవీకి ఏకంగా మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో పోలిక పెట్టేసుకుంటోందట శ్రీదేవి. ఓ హీరోయిన్ 300 సినిమాలు చేయడం అనేది చాలా పెద్ద విషయమే.. నిజంగా ప్రశంసించాల్సిన విషయమే. అయినంత మాత్రాన తన చిత్రాన్ని మెగా150 టైపులో విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వాలని.. పీఆర్ లకు చెబుతుండడం మాత్రం కరెక్ట్ కాదని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.

#మెగా150 కి ఆ రేంజ్ రావడం వెనక.. మెగాస్టార్ దాదాపు దశాబ్దకాలం సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. పైగా చిరు రీఎంట్రీ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూశారు. చిరు తిరిగి సినిమాలు చేయడం అనే పాయింట్ అక్కడ కోట్లాదిమందిని ఎగ్జైట్ చేసింది.

,  ,  ,  ,  ,