Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 10:12:54
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు సినిమా టీజర్లో మహేష్ బాబు ఉంటాడు కాని.. ఈ సాలీడ్లు వంటి పురుగుల గోల ఏంటండీ బాబూ? అనుకుంటున్నారా.. అయితే ఇక్కడే ఒక కొత్త విషయం తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చింది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ వినిపిస్తోంది. చూస్తోంటే ఈ సినిమా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనే డౌటే వస్తోంది మరి.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో కొన్ని రోబోటిక్స్ కూడా వాడుతున్నారట. వాటిలో ముఖ్యంగా ఒక రోబో సాలిపురుగు ఒకటి ఉంటుంది. ప్రస్తుతం రిలీజ్ చేయనున్న టీజర్లోనే ఈ రోబో సాలీడును ప్రపంచానికి చూపించాలని మహేష్ డైరక్టర్ మురుగుదాస్ ఫిక్సయ్యారని టాక్. అందుకే ఇప్పుడు లండన్ లో ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారితో ఈ సాలీడు తాలూకు కంప్యూటర్ గ్రాఫిక్స్ 35 లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తున్నారట. ఒకవేళ ఈ సినిమాలో మహేష్ ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి.. జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఈ సాలీడు మనోడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుందేమో.

ఏదేమైనా కూడా సడన్ గా ఈ గ్రాఫిక్స్ తాలూకు న్యూస్ తో మహేష్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్

,  ,  ,  ,