Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Sep-2016 12:18:14
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. బాహుబలి మూవీని బాగానే వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మహేష్ కి- బాహుబలికి లింక్ ఏమీ లేకపోయినా.. బాహుబలి రెండు భాగాల విషయంలోనూ మహేష్ సినిమాతో క్లాష్ వచ్చేస్తోంది.

మహేష్ బాబుతో తీస్తున్న సినిమాకి రీసెంట్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు దర్శకుడు మురుగదాస్. 2017 ఏప్రిల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు. ఇది బాహుబలి-ది కంక్లూజన్ కు విడుదల తేదీగా ఇప్పటికే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. తెలుగులో ఎవరూ ప్రకటించలేదు కానీ.. హిందీ వెర్షన్ ని విడుదల చేస్తున్న కరణ్ జోహార్ మాత్రం ఈ సంగతి చెప్పేశాడు. అసలు బాహుబలి ది బిగినింగ్ విషయంలో కూడా డేట్ ముందే చెప్పి.. పట్టు పట్టి మరీ 2015 జూలై 10న విడుదల చేయించింది కూడా కరణ్ జోహారే.

అయితే.. బాహుబలి ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలో కూడా మహేష్ బాబు శ్రీమంతుడుతో క్లాష్ వచ్చింది. బాహుబలి వచ్చినా సరే జూలై 17న విడుదల చేస్తానని గట్టిగానే చెప్పాడు మహేష్. తర్వాత చర్చలు జరుపుకుని ఆగస్టుకు వాయిదా వేసుకోవడం.. రెండు సినిమాలు లాభపడ్డం జరిగాయి. ఇప్పుడు కూడా మళ్లీ బాహుబలి డేట్ కే సినిమాని అనౌన్స్ చేయడంలో.. ఆంతర్యం ఏంటి మురుగా?

,  ,  ,  ,  ,  ,