Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 10:30:34
facebook Twitter Googleplus
Photo

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం చూసి.. టాలీవుడ్ కి చాలా కాలం అయిపోయింది. ముఖ్యంగా టాప్ రేంజ్ లో ఉన్న ఇద్దరు హీరోలు సినిమాలు రావడం లేదు. ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ కేరక్టర్లుగా కనిపించడం లాంటివి కూడా టాలీవుడ్ టాప్ హీరోలు చేయడం లేదు. ఇలాంటి కామెంట్స్ అన్నింటికి చెక్ పడిపోయేలా.. ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలోను.. టాలీవుడ్ ఇండస్ట్రీలోను చక్కర్లు కొడుతోంది.

పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడులో మహేష్ బాబు ఓ చిన్న రోల్ చేయనున్నాడట. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర కొన్ని నిమిషాల పాటే ఉన్నా.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్రకు మహేష్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి.. దర్శకుడు డాలీ వెళ్లి మహేష్ ను అడగడం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం కూడా జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఈ విషయం పై అటు మహేష్ నుంచి కానీ.. ఇటు పవన్ సైడ్ నుంచి కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి.. ఇప్పటికి ఇది రూమర్ మాత్రమే. ఈ గాసిప్ నిజం అవకూడదనేందుకు పెద్దగా కారణాలేమీ లేవు.

నిజానికి పవర్ స్టార్-సూపర్ స్టార్ లు ఆఫ్ స్క్రీన్ లో మంచి మిత్రులే. గతంలో పవన్ మూవీ జల్సాకు మహేష్ వాయిస్ ఓవర్ చెప్పాడు కూడా. మేము సైతం లాంటి ఓ పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఉమ్మడిగా హోస్ట్ చేస్తారనే టాక్ వచ్చింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైతే కాటమరాయుడులో మహేష్ బాబు అన్నదే టాలీవుడ్ లో హాట్ హాట్ గాసిప్.

,  ,  ,  ,  ,  ,  ,