Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Apr-2016 13:30:35
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న ?బ్రహ్మోత్సవం? సినిమా మే నెలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైన క్రేజీ ప్రాజెక్టుల్లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ?శ్రీమంతుడు? లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్ హీరోగా నటిస్తోన్న సినిమా కావడం, ?సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు? సినిమాతో మహేష్‌కి ఓ గుర్తుండిపోయే హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో ?బ్రహ్మోత్సవం?పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో అభిమానులను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. గతంలో మే నెలలో విడుదలైన మహేష్ రెండు సినిమాలూ పరాజయం పాలయ్యాయి. మే నెలలో మహేష్ నటించిన ?నాని?, ?నిజం? సినిమాలు విడుదలై మెప్పించలేకపోయాయి. ఇప్పుడదే నెలలో వస్తోన్న ?బ్రహ్మోత్సవం? మాత్రం ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందన్న నమ్మకంతో మహేష్ ఉన్నారు. మంచి కథ, అద్భుతమైన కాస్టింగ్ ఉన్న బ్రహ్మోత్సవం తప్పకుండా అందరినీ అలరిస్తుందని టీమ్ చెబుతూ వస్తోంది. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మే 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది

,  ,  ,  ,  ,  ,