Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2017 11:05:40
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. స్పై-డర్ అనే టైటిల్ ను తెలుగు.. మలయాళ.. హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్ చేయించేశారు నిర్మాతలు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్.. టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే.. ప్రాబ్లెం ఎక్కడొస్తుందంటే.. తమిళ్ వెర్షన్ తోనే. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ.. తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోందనే సంగతి తెలిసిందే. రెండు భాషల్లోనూ ఒకటే టైటిల్ ఉండేలని మహేష్ పట్టు పట్టడంతోనే.. ఇన్ని నెలల పాటు ఫస్ట్ లుక్ కూడా ఇవ్వకుండా మహేష్ ని దాచేశారు. కానీ ఇప్పుడు స్పై-డర్ అనే టైటిట్ కి తమిళ నిర్మాతలు ఒప్పుకునే అవకాశం ఉండదు. అక్కడ తమిళ పేరుతో టైటిల్ ఉంటేనే.. సినిమాకి 100 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. కానీ స్పై-డర్ అనే ఇంగ్లీష్ పేరు పెడితే.. ఆ పన్ను రాయితీలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే తంబీలు ఈ టైటిల్ కు నో చెప్పే ఛాన్సుంది.

ఇది నిర్మాతలకు భారీగానే నష్టపరిచే అంశం. అందుకే మహేష్ మూవీ తమిళ్ వెర్షన్ కు స్పై-డర్ అనే టైటిల్ ఉండకపోవచ్చు. అందుకు తగ్గట్లుగానే.. స్పై-డర్ టైటిల్ ను తెలుగు- మలయాళ-హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్ చేశారు కానీ.. తమిళ నిర్మాతలు మాత్రం చేయలేదని అంటున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం రెండు భాషల్లో ఒకటే టైటిల్ అనే విషయంలో మహేష్ అయినా తగ్గాలి.. లేకపోతే కొత్త టైటిల్ వెతుక్కోవాలి.

,  ,  ,  ,  ,  ,  ,  ,