Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jul-2016 16:26:15
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్ : బ్రహ్మోత్సవం రిలీజైన వెంటనే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ టూర్ కు సంభందించిన అనేక ఫొటోలు ఇప్పటికే మనం చూసాం. సోషల్ మీడియా సైట్లలోనూ మహేష్ అభిమానులు వాటిని రోజూ షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మహేష్ ఫ్యామిలీ సెల్పీ అంటూ ఓ ఫొటో వైరల్ లాగ వెల్తోంది. ఈ ఫొటోలో మహేష్ తన బార్య నమ్రతతోనూ, పిల్లలిద్దరూ విడిగానూ సెల్ఫీలు దిగారు. వాటిని రెండింటిని జాయింట్ చేసి ఫ్యామిలీ సెల్ఫీ పేరట చలామణి చేస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యామిలీ యూకెలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ట్రిప్పుకు సంబందించిన ఫోటోలు మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీతో టూర్ కు వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరదాలతోనూ, సాహసాలతోనూ గడిపేసారు. షూటింగ్స్, డేట్స్, లొకేషన్స్, కథలు , ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్, హిట్స్, ప్లాఫులు ఇవన్నీ వదిలేసి కొత్త ప్రపంచంలోకి వెళ్లి రీఛార్జ్ అయివచ్చారు. ఫిల్మి వరల్డ్ వదిలి ఫ్యామిలీ ప్రపంచంలోకి వెళ్లిపోయారు. యూరప్ లో అందమైన ప్రాంతాల్లో హాయిగా గడిపేసి వచ్చారు. యూరప్ కు హాలిడే ట్రిప్ గా వెళ్లిన మహేష్ ..అక్కడ తన భార్య , కుమారుడు గౌతమ్ లతో కలిసి ట్రెక్కింగ్ చేసారు. అక్కడ చిక్కని అడవుల్లో తిరిగారు. గౌతమ్ కూడా బాగా ఎంజాయ్ చేసారు. అక్కడ ఎత్తైన చెట్లు ఎక్కారు. ఇదో ఫ్యామిలీ ఎడ్వెంచర్ గా నమ్రత పేర్కొంటోంది.

,  ,  ,  ,  ,