Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 13:11:46
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి హీరోగా వినూత్న సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న సుధీర్ బాబు, తాజాగా ?బాఘీ? అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్‍గా నటించే అవకాశం సుధీర్ బాబును వెతుకుతూ రావడం అప్పట్లోనే సంచలనం సృష్టించగా, ఈమధ్యే సినిమాలో సుధీర్ ఎలా ఉండబోతున్నాడో తెలియజేసే ట్రైలర్ విడుదలయ్యాక సుధీర్ అంతటా సెన్సేషన్‍గా మారిపోయారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే బాఘీ గురించి సుధీర్‌కు సూపర్ స్టార్ మహేష్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా బాఘీ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను విడుదల చేస్తూ మహేష్ సుధీర్‌కు విషెస్ తెలిపారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, సుధీర్‌ను ఓ హిందీ సినిమాలో ఇలాంటి పాత్రలో చూడడం గర్వంగా ఉందని మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. కండలు తిరిగిన దేహంతో, ఓ పవర్ఫుల్ విలన్‌గా సుధీర్ నటించిన బాఘీకి ఇప్పటికే తెలుగు స్టార్స్ అంతా మంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు.

,  ,  ,  ,  ,