Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2017 10:55:40
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి 151వ సినిమాగా సైరా వచ్చేస్తోంది. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అంటే.. కరక్టుగా ఫస్ట్ లుక్ కాదుగాని థీమ్ ను ఇంట్రొడ్యూస్ చేశారనే చెప్పాలి. అయితే ఈరోజు కొణిదెల ప్రొడక్షన్స్ వారు విడుదల చేసిన పోస్టర్లను చూసి ఇప్పుడు కొన్ని కామెడీ పంచులు కూడా పడుతున్నాయి. అసలు మెగాస్టార్ ను చూసి పోస్టర్ డిజైన్ చేయకుండా.. వేరే హీరోను చూసి చేశారు అంటున్నారు నెటిజన్లు.

నిజానికి ఈ సైరా పోస్టర్ కోసం రేనాడు కోట బ్యాక్ డ్రాపులో బ్రిటీష్ జెండాలను తగలబెడుతూ.. వెనుకనుండి కనిపిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంటాడు. కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ నుంచుంది మెగాస్టార్ చిరంజీవి కాదు.. మరెవరో హీరో అన్నట్లుంటుంది సదరు ఆర్ట్ వర్క్. అయితే చాలామందికి ఆ ఫోజును చూస్తే.. బద్రినాథ్ సినిమాలో అల్లు అర్జున్.. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి గుర్తొస్తున్నారట. అదేంటి సైరా పోస్టర్ పై అల్లు అర్జున్ ఫోటో వేశారు అంటూ కామెడీలు చేస్తున్నారు. ముందులో మనకు సందేహం రాదు కాని.. ఎవరన్నా ఆ మాటన్నాక ఓసారి చూస్తే మాత్రం.. నిజంగానే అల్లు అర్జున్ ఫోటో పెట్టారా అన్నట్లే ఉంది కదూ!!

సైరా సినిమాలో మెగాస్టార్ పక్కనే అమితాబ్ బచ్చన్.. జగపతి బాబు.. సుదీప్.. విజయ్ సేతుపతి.. నయనతార వంటి క్యాస్టింగును చూస్తుంటే.. వీరందరూ అసలు ఎలాంటి గెటప్స్ లో కనిపించబోతున్నారు అనే ఆసక్తి సాధారణంగానే ఉంటుంది.

,  ,  ,  ,  ,