Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 13:58:21
facebook Twitter Googleplus
Photo

ప్రిన్స్ మహేష్ ..రియాలిటీలో పక్కా శ్రీమంతుడు. ప్రేక్షకాదరణలో పారితోషికంలో శ్రీమంతుడు. బ్రాండ్ ప్రమోషన్ లోనూ శ్రీమంతుడే. బాలీవుడ్ హీరోలకు ధీటైన ఛరిష్మాతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించే సత్తా ఉన్న హీరో అతడు. అందుకే తొలి నుంచి అతడికి ఓ వైపు సినిమాలో మరో వైపు బ్రాండ్ ప్రమోషన్ యాక్టివిటీస్.. రెండిటిలో ఒకటే జోరు కొనసాగిస్తున్నాడు.

ఇప్పటికే మహేష్ ఖాతాలో జాతీయ - అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ లు ఉన్నాయి. థమ్సప్ - ప్యారగాన్ లాంటి కంపెనీలకు ప్రమోటర్ గా కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. తాజాగా అతడి ఖాతాలోకి మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రమోట్ చేస్తున్న ఓ నేషనల్ రేంజు బ్రాండ్ ఒకటి వచ్చింది. ప్రిన్స్ ఈ యాడ్ ని టేకోవర్ చేసేశాడని సమాచారం.

దేశంలో అసహనం పెరిగిపోతోంది అంటూ ఇటీవలే కామెంట్ చేసిన అమీర్ .. తనలోని అసహనాన్ని బైటి ప్రపంచానికి చెప్పేయడంతో కొంప కూలినంత పనైంది. అతడి నుంచి ఒక్కో బ్రాండ్ దూరమైపోయే పరిస్థితి తలెత్తింది. అలా ఓ కంపెనీ కాంట్రాక్టును అమీర్ తోనే పునరుద్ధరించుకోకుండా మహేష్ కి ఆ ఛాన్సిచ్చింది. మహేష్ తర్వాత బ్రాండ్ ప్రమోషన్ లో అనూహ్యంగా ప్రభాస్ తెరపైకొచ్చాడు. బాహుబలి తర్వాత ఓ జాతీయ స్థాయి వాణిజ్య ప్రకటనలో నటించే ఛాన్స్ అందుకున్నాడు.

,  ,  ,  ,