Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 14:33:23
facebook Twitter Googleplus
Photo

మంచు లక్ష్మీ ప్రసన్న తన కెరీర్ లో చాలానే సినిమాలు చేసింది. విభిన్నమైన కేరక్టర్లతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. బెస్ట్ విలన్ గా నంది అవార్డును గెలుచుకున్న హిస్టరీ కూడా ఈమె సొంతం. అలాంటి మంచు లక్ష్మి ఇప్పుడు ఓ కేరక్టర్ కోసం కష్టపడుతోంది. తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ న్యాయమూర్తి పాత్రను పోషిస్తున్న మంచు లక్ష్మి.. అందుకోసం బోలెడంత రీసెర్చ్ కూడా చేస్తోంది.

వసూల్ రాజా - సాధ్యం వంటి చిత్రాలను తీసిన కార్తికేయ గోపాలకృష్ణ చెప్పిన స్టోరీ నచ్చిన మంచు లక్ష్మి.. జడ్జ్ పాత్రలో చేసేందుకు ఒప్పుకుంది. అయితే.. న్యాయం కోసం పోరాడే ఓ పవర్ ఫుల్ రోల్ కావడంతో.. ఈ పాత్ర కోసం ఆమె చాలా పరిశోధన చేసేస్తోంది. ముఖ్యంగా లుక్ విషయంలోను.. బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ.. నిజమైన జడ్జిల మాదిరిగా నటన ఉండాలని భావిస్తోంది ఈ మంచు వారసురాలు. అందుకే సిటీలోను అనేకమంది లాయర్లను కలుస్తూ.. వారి సలహాలు సూచనలను తీసుకుంటోంది.

ఒక పాత్ర కోసం మంచు లక్ష్మి తీసుకుంటున్న ఎలర్ట్ - ఎఫర్ట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అయితే ఈ రోల్ ద్వారా తన కెరీర్ ఫుల్ టర్న్ అయి.. పీక్ స్టేజ్ కి వెళుతుందనే నమ్మకంతో ఉందట మంచు లక్ష్మి. అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా.. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది.

,  ,  ,  ,  ,  ,