Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jul-2015 13:26:57
facebook Twitter Googleplus
Photo

నిజమే చైతూ మనసు పారేసుకున్నది అమ్మాయి మీద కాదు. ప్రేమమ్ అనే సినిమా మీద. ముందుగా ఈ సినిమాని ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తాడని అంతా టాం టాం అయింది. దీనిపై స్పందించిన రామ్ ఆ సినిమా పేరు నాకేం తెలీదు. ఇంకా రీమేకా..? అంటూ గాలి తీసేశాడు. ఇప్పుడు ఆ సినిమా చూసిన అక్కినేని వారి పిల్లగాడు ఎలాగైనా ఈ సినిమా చేసి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడట.

చైతూ అంత పట్టు పట్టడానికి కారణం వుంది. మనోడికి కలిసొచ్చింది అక్కినేని మార్క్ ప్రేమకథలే. మాస్ స్టైల్ ఆసలు వర్కౌట్ కాలేదు. ప్రేమమ్ సినిమా రొమాంటిక్ కామెడీ పైగా మలయాళంలో సూపర్ హిట్. అందుకే ఈ సినిమాని తెలుగు తెరకి ఎక్కించి ఓ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట. మనం తర్వాత మూడు సినిమాలు వచ్చినా ఒక్కటీ హిట్ అనిపించుకోలేదు. ఈ విషయమై చైతూ డేట్స్ పట్టుకున్న సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణకు తెలుగు రైట్స్ తీసుకోమని పురమాయించాడట. అన్నీ కలిసొస్తే చైతూ ఆశ తీరడం తథ్యమే. ఆల్ ది బెస్ట్ చైతూ.

,  ,  ,