Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2016 16:43:58
facebook Twitter Googleplus
Photo

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్స్ విపరీతంగా వచ్చేస్తాయి. మూవీ బాగుందంటే.. కనకవర్షం కురవడం ఖాయం. ఇక ఇతర భాషల్లోనూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటివరకూ సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఓవర్సీస్ లో హీరోల కంటే ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాలనే పట్టించుకుంటున్నారు. అయితే కేరళ మార్కెట్లో మాత్రం బన్నీ దున్నేస్తున్నాడు. అక్కడి లోకల్ సినిమాల స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాడు.

మలయాళంలో డబ్ అయిన తెలుగు సినిమాల వరకూ చూస్తే.. హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 10లో.. బన్నీ సినిమాలే 8 నిలిచాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి(రూ.14.65 కోట్లు)నిలవగా.. యోధావు అంటూ రిలీజ్ అయిన సరైనోడు (రూ.4.5కోట్లు) కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. యోధావు ఇంకా మల్లూవుడ్ బాక్సాఫీస్ ని ఇరగదీసేస్తోంది. మూడో స్థానంలో రుద్రమదేవి(రూ.4.35 కోట్లు) - నాలుగో స్థానంలో సన్నాఫ్ సత్యమార్తి (రూ. 3కోట్లు) - ఐదో స్థానంలో లక్కీ: ది రేసర్(రేసుగుర్రం)(రూ. 2.65 కోట్లు) ఉన్నాయి.

ఆరో ప్లేస్ లో బద్రీనాథ్ (రూ. 2.35 కోట్లు) - ఏడో స్థానంలోఆర్య2 (రూ. 1.95 కోట్లు) - ఎనిమిదో స్థానంలో ఎవడు (రూ. 1.60కోట్లు) - తొమ్మిదిలో ధీర(మగధీర) (రూ. 1.45కోట్లు) - పదో స్థానంలో గాజా పొక్కిరి (జులాయి) (రూ. 1.25 కోట్లు) కొల్లగొట్టాయి. బాహుబలి - మగధీర తప్పితే.. మిగిలిన సినిమాలన్నీ బన్నీవే. మల్లూవుడ్ లో ఇదీ బన్నీ స్టామినా.

,  ,  ,  ,  ,