Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2017 11:51:44
facebook Twitter Googleplus
Photo

వెబ్ సిరీస్ కొత్త హంగులు దిద్దుకుంటోంది. సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నాయి. తాజాగా నటుడు నాగేంద్రబాబు - ఆయన కూతురు నీహారిక నాన్న కూచి పేరిట ఓ వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ట్రయిలర్ ను ఈమధ్యనే నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. తాజాగా నవదీప్ - తేజస్వి మాదివాడ - అదిత్ అరుణ్ కలిసి ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వెబ్ సిరీస్ చేస్తున్నారు.

మన ముగ్గురి లవ్ స్టోరీ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో తీసిన ఈ వెబ్ సిరీస్ కు అలా మొదలైంది లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన నందిని రెడ్డి స్క్రిప్ట్ అందించడం విశేషం. మొత్తం సిరీస్ షూటింగ్ 39 రోజుల్లో పూర్తి చేశారు. ఇప్పటికే యూఎస్ లో దీనిని రిలీజ్ చేశారు. అక్కడి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇండియాలోనూ రిలీజ్ చేయడానికి డైరెక్టర్ శశాంక్ సిద్ధమవుతున్నాడు. ఇక్కడ కూడా మంచి సక్సెస్ లభిస్తుందని ఆశతో ఉన్నాడు. ఈనెల 8న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించిన తేజస్వి.. హీరోలు నవదీప్ - అరుణ్ ఆల్రెడీ సినిమాల్లో గుర్తింపు ఉన్నవారే. నవదీప్ పలు సినిమాల్లో హీరోగా నటించడంతోపాటు తాజాగా క్యారెక్టర్ పాత్రలు చేస్తున్నాడు. తేజస్వి మాదివాడ కూడా ఒకటి - రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగానే ఉంది. అదిత్ అరుణ్ కూడా కథ సినిమాలో హీరోగా నటించిన వాడే.

,  ,  ,  ,