మంచు మనోజ్ హ్యాండ్ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. సత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మనోజ్ . ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రగ్యా జైశ్వాల్ ను ఎంపిక చేశారు. ఇది చాలా రోజుల క్రితం మాట.
తాజగా విషయానికి వస్తే.. ఈ సినిమా నుండి తప్పుకుందట ప్రగ్యా . ఈ సినిమా మరీ ఆలస్యం అవుతుండటం, దానితో పాటు ఆమె కూడా కొత్త ఆఫర్లు రావడంతో మనోజ్ సినిమాని వదులుకుందట. ఇప్పుడు ఆమె ప్లేస్ లో కొత్త భామ కోసం వేట మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. చాలా రోజులుగా హిట్ లేక డీలా పడ్డ మనోజ్ కు ఈ సినిమా కీలకం కానుంది