Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 16:50:16
facebook Twitter Googleplus
Photo

ఆచారి అమెరికా యాత్ర.. ఈ టైటిల్ వినిపించగానే ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ చూస్తే ఆ ఫీలింగ్ మరింత పెరుగుతోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచ్చేసిది. సినిమా షూటింగ్ ఆరంభం కానున్న నేపథ్యంలో ముందే ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. మంచు విష్ణుతో పాటు బ్రహ్మికి కూడా ఈ ఫస్ట్ లుక్ లో చోటు దక్కింది. పేరు చూస్తేనే హీరో ఇందులో బ్రాహ్మణ కుర్రాడని అర్థమైపోయింది. అదుర్స్ సినిమాలో బ్రహ్మి-ఎన్టీఆర్ జోడీని గుర్తుకు తెచ్చేలా ఉన్నారు బ్రహ్మి-విష్ణు ఇందులో. ఆచారి అమెరికా యాత్ర అనే టైటిల్ కు తగ్గట్లు.. కృష్ణమాచారి తప్పులు-అప్పలాచారి తిప్పలు అనే ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టారు ఈ చిత్రానికి.

మంచు విష్ణుతో ఇంతకుముందు దేనికైనా రెడీ.. ఈడోరకం ఆడోరకం లాంటి సినిమాలు తీసిన కామెడీ డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. పద్మజ పిక్చర్స్ బేనర్ మీద కీర్తి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం చేతులు కలిపిన అందరికీ ఇప్పుడు హిట్టు చాలా అవసరం. మంచు విష్ణు.. లక్కున్నోడు సినిమాతో బోల్తా కొడితే.. నాగేశ్వరరెడ్డికి వరుసగా ఆటాడుకుందాంరా.. ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇక బ్రహ్మి లైమ్ లైట్లోంచి వెళ్లిపోయి చాలా కాలమైంది. ఆయన్ని అందరూ మరిచిపోతున్న పరిస్థితి. కాబట్టి ఈ ముగ్గురికీ మంచి విజయం అవసరం.

,  ,  ,  ,  ,