Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2017 13:19:00
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకునేందుకు కేవలం ఒక మెట్టు దూరంలో ఉంది. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పై-డర్ సక్సెస్ అయితే మాత్రం.. ఇకపై రకుల్ ని స్టార్ అనేయచ్చు. అలాంటి సిట్యుయేషన్ లో ఉన్న రకుల్.. నాగచైతన్య మూవీపై ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పింది.

గత ఆరేళ్లలో డజన్ సినిమాలు చేసిన రకుల్ ప్రీత్.. చైతు సినిమాతో మొదటిసారిగా ఓ ఫీట్ సాధించానని అంటోంది. 'ఇప్పటి వరకూ నేను చేసిన రోల్స్ లో చాలావరకు స్ట్రాంగ్ పాత్రలే అయినా.. సరిగ్గా పరిశీలిస్తే అవేమీ మెయిన్ స్టోరీలోవి కావనే సంగతి అర్ధమవుతుంది. ఉప కథలో అలాంటి కేరక్టర్స్ రావడం అదృష్టమే అయినా.. రా రండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో మొదటిసారిగా మెయిన్ ప్లాట్ లో భాగం అందుకున్నాను. ఈ మూవీలో నా కేరక్టర్ కు నాగచైతన్య పాత్రతో సమానంగా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.

కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టమైన ఓ పల్లెటూరి అమ్మాయి పాత్ర ఇది. నా పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంటుంది. నాకు ఈ రోల్ ఎంతగా నచ్చేసిందంటే.. అసలీ మూవీ షూటింగ్ ఎప్పటికీ పూర్తి కాకూడదని కోరుకుంటున్నా.

,  ,  ,  ,  ,  ,