Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Aug-2016 11:31:38
facebook Twitter Googleplus
Photo

సక్సెస్ జోష్లో ఉన్న యంగ్ హీరో మంచు విష్ణు సొంత బ్యానర్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అడ్డా ఫేం కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సరదా అనే సినిమా చేస్తున్న విష్ణు. ఈ సినిమా తరువాత లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కన్ఫామ్ చేసిన మోహన్ బాబు.., సినిమాకు సేనాపతి అనే టైటిల్ను నిర్ణయించినట్టుగా ప్రకటించారు.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్లో మోహన్ బాబు కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు మాత్రం వెల్లడించలేదు. సేనాపతి సినిమాతో పాటు మనోజ్ హీరోగా కూడా ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు మోహన్ బాబు.

,  ,  ,  ,  ,