Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2017 12:40:13
facebook Twitter Googleplus
Photo

సినిమాల్లోనూ ఒక ఇంట్లో దెయ్యాలుంటాయ్ అవి జనాలందరినీ భయపెడతాయ్. కాని ఇక్కడ మాత్రం మనుషులే దెయ్యాలను భయపెడతారట. అది కథ. అదే ఆనందో బ్రహ్మ కథ. తాప్సీ మెయిన్ లీడ్ లో శ్రీనివాస రెడ్డి లీడుగా రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదల చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.

ఇప్పుడు విషయం ఏంటంటే ఒక చిన్నపిల్లకు ఒక తాతయ్య కథ చెబుతూ ఉంటాడు. అయితే అన్ని సినిమాల్లో తరహాలో ఇక్కడ దెయ్యాలు మనుషులను భయపెట్టవని.. మనుషులే దెయ్యాలను భయపెడతారనేది థీమ్. కాకపోతే ఇందులో ఎవరు దెయ్యం ఎవరు మనుషులు అనేది తెలుసుకోవడం కాస్త కష్టమే కాని.. చూస్తుంటే తాప్సీ అండ్ గ్యాంగ్ ఇందులో దెయ్యాలని అనిపిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి అండ్ వెన్నెల కిషోర్ కామెడీ వర్కవుట్ అయ్యేట్లే ఉంది. ఇక షకలక శంకర్ పవర్ స్టార్ తరహాలో భయ్యం డైలాగును పేల్చాడు. మరి తాప్సీ రోల్ ఏంటనేది అప్పుడే ట్రైలర్ తో అంచనా వేయలేంలే. కాకపోతే ట్రైలర్ చివర్లో కథ వింటున్నపాపాయిని వాళ్ళమ్మ పడుకోమంటే.. తాతయ్య కథ చెబుతున్నాడు ఆగు అంటుంది.. అదేంటే తాతయ్య చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యిందిగా అని అమ్మ అనడంతో.. ఆడియన్స్ షాకవ్వాల్సిందే.

చూస్తుంటే దర్శకుడు మహి.వి.రాఘవ్ పాఠశాల సినిమా తరువాత ఇప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఒక హారర్ స్టోరీతో వచ్చినట్లున్నాడు. కాకపోతే ఇదే థీమ్ లో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చేసిన మీదట.. సినిమా రిలీజైతేనే కాని కంటెంట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం.

,  ,  ,  ,  ,