Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2016 10:45:41
facebook Twitter Googleplus
Photo

తెలుగు వారు గాన గంధర్వుడిగా పిలుచుకునే ఆయన గొంతు.. ఇక ఐఫోన్లలో యుట్యూబుల్లో వినడమే తప్పించి.. శాశ్వతంగా నిజజీవితంలో వినే అవకాశం కోల్పోయిందీ లోకం. ఈ 86 ఏళ్ల వాకింగ్ లెజండ్ ఇక తరలిరాని తీరాలకు వెళ్లిపోయారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈరోజు సాయంత్రం కన్ను మూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాదపడుతున్న ఆయన.. చెన్నయ్ లోని తన స్వగృహంలో తనువు చాలించారు.

తెలుగు వారికి ఒక ప్రముఖ గాయకుడిగా.. సంగీతా విధ్వాంసుడిగా.. మ్యూజిక్ డైరక్టర్ గా ఆయన సుపరిచితం. అసలు అమెరికాలో ఇలా సంగీత కచేరీలు నిర్వహించే అలవాటును మనకు పరిచయం చేసింది ఆయనే. తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభిరామయ్య - సూర్యకాంతం దంపతులకు 1930 జులై 6న జన్మించిన ఆయన ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. కేవలం పాటలను పాడటమే కాక వయోలిన్ వీణ మురళి మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. వివిధ దేశాల్లో పలు కచేరీలు చేశారు.. ఏకంగా 25 వేల కచేరీలు చేసిన రికార్డును నెలకొల్పారు.

పలు సినిమాలకు సాంస్కృతిక పాటలను కంపోజ్ చేసిన మంగళంపల్లి.. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. హంసగీతే అనే కన్నడ సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరక్టర్ అవార్డును అందుకున్న ఆయన.. మాధవాచార్య సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారాయన. భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషన్ అవార్డును ఇచ్చి సత్కరించింది.. ఫ్రాన్స్ దేశం ఆయనకు ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే ఆర్డర్ ను ప్రధానం చేసింది.

అనేక ప్రముఖులు.. రాష్ట్ర గవర్నర్లు.. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. మంగళంపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.

,  ,  ,  ,