Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 12:04:48
facebook Twitter Googleplus
Photo

లవ్ స్టోరీస్ తీయడంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్రతిభే వారు. ఎప్పటికప్పుడు కాలంతో పాటు అప్ డేట్ అవుతూ.. తన ఏజ్ పెరుగుతున్నా సమయానుకూలంగా సినిమాల్లో మార్పులు తీసుకొస్తూ.. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా తన హవా కొనసాగిస్తున్నారు మణిరత్నం.

ఇప్పుడీయన కోలీవుడ్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో ఓ మూవీ చేస్తున్నాడు. అదితి రావ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని.. చాలా వేగంగానే ఫినిష్ చేసేశారు మణి సారు. మొత్తం సినిమాను సిమ్లా.. ఆ పరిసరాల్లోనే షూట్ చేసేయడం విశేషం. సాధారణంగా మణిరత్నం తీసుకునే గడువుతో పోల్చితే.. చాలా తక్కువ టైమ్ లోనే షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. ఇప్పుడు చివరిదశకు చేరుకుంది కూడా. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం.. మణిరత్నం-రెహమాన్ మ్యాజికల్ మ్యూజిక్ కాంబో కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశంలో ఉన్నాయి.

మరికొన్ని వారాల్లో మిగిలిన పనులు పూర్తి చేసేసి.. కార్తీ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయనున్నారట మణిరత్నం. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ ఒకేసారి రిలీజ్ అయిపోతుంది లెండి. మణిరత్నం మూవీ.. అందులోనూ కార్తి హీరో.. రెహమాన్ మ్యూజిక్.. తెలుగోళ్లకు నచ్చడానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి.

,  ,  ,  ,  ,  ,