Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2017 10:26:46
facebook Twitter Googleplus
Photo

సంగీత దర్శకుడు మణి శర్మకు మెలోడీ బ్రహ్మ అనే బిరుదు ఉంది. దాదాపు అందరు స్టార్ హీరోలకు సంగీతం ఇచ్చిన ఈయన.. ఎన్నో మరపురాని పాటలను అందించాడు. కొన్నేళ్లుగా రేసులో వెనకబడ్డా.. మళ్లీ జెంటిల్మన్ మూవీతో ఫామ్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ తో పాటు పలు చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి.

దర్శకుడు వంశీతో తొలిసారిగా పని చేస్తున్న మణి శర్మ.. ఆయన శైలి సంగీతాన్ని.. తన స్టైల్ లో అందించానని చెబుతున్నాడు. అలాగే అప్పటి లేడీస్ టైలర్ లోని మ్యూజిక్ తో ఇప్పటి ఫ్యాషన్ డిజైనర్ ను పోల్చడం సరికాదని.. అప్పుడు తాను ఇండస్ట్రీలో లేనని చెప్పాడు మణి శర్మ. అయితే.. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో దాదాపు అన్ని ట్యూన్స్ కొన్ని వారాలకో.. నెలలకో జనాలకు గుర్తుండడం లేదు. దీనికి కారణం హీరోలే అంటున్నాడు ఈ కంపోజర్. హీరోల టేస్ట్ కు తగ్గట్లుగా అన్ని మారిపోతున్నాయని.. ఒక హీరో డ్యాన్స్ అంటే అందుకు తగ్గట్లుగా చేయాల్సి ఉంటుందని.. మరో హీరో యాక్షన్ అంటే మ్యూజిక్ అలా సెట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

అందుకే ఇప్పుడు తన టేస్ట్ కు తగిన దర్శకుల సినిమాలకే పని చేస్తున్నానని మణిశర్మ అంటున్నాడు. వంశీతో ఫ్యాషన్ డిజైనర్.. ఇంద్రగంటితో అమీ తుమీ.. హను రాఘవపూడితో లై.. శ్రీరామ్ ఆదిత్యతో శమంతక మణి చిత్రాలతో పాటు మరికొంత మంది యువ దర్శకులతోనూ సినిమాలు చేస్తున్నట్లు చెప్పాడు

,  ,  ,  ,