Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 14:51:10
facebook Twitter Googleplus
Photo

జెంటిల్మన్ సినిమాతో తనేంటో మళ్లీ రుజువు చేసుకున్నాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఈ సినిమాలో ఇటు పాటలు.. అటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు మణి. ఆ సినిమా విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. మళ్లీ మణిశర్మ గురించి పెద్ద చర్చ జరిగింది ఈ సినిమా రిలీజ్ టైంలో. సరైన సబ్జెక్టు.. టేస్టున్న దర్శకుడు తన దగ్గరికి వస్తే అదిరిపోయే ఔట్ పుట్ ఇస్తానని చూపించాడు మణి. ?జెంటిల్మన్? సినిమాకు మణిశర్మను సమర్థంగా వాడుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

?జెంటిల్మన్? సక్సెస్ తర్వాత ఇంద్రగంటి.. అక్కినేని నాగచైతన్యతో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. వారాహి చలనచిత్రం బేనర్ మీద సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. సంగీత ప్రాధాన్యమున్న ఈ చిత్రానికి మణిశర్మే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. గతంలో చైతూ తండ్రి నాగార్జునతో ఎన్నో మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు మణి. చైతూతో ఆయన పని చేయడం ఇదే తొలిసారి. సంగీత దర్శకుడిగా పెద్ద సినిమాలకు దూరమైనప్పటికీ.. కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు నేపథ్య సంగీతం ఇస్తూ బిజీగా ఉన్నాడు మణి. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత పేరున్న హీరో సినిమాకు పూర్తి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,