Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 13:15:55
facebook Twitter Googleplus
Photo

నా పేరేంటో తెలుసుగా.. బాషా.. మాణిక్ బాషా' అంటూ 22 ఏళ్ల క్రితం బాషా మూవీతో సూపర్ స్టార్ రజినీకాంత్ సృష్టించిన సెన్సేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తెలుగులో రజినీకాంత్ ను స్టార్ హీరో సినిమా ఇది. మాఫియా డాన్ స్టోరీని.. తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో దర్శకుడు సురేష్ కృష్ణ చెప్పిన విధానం.. అందరినీ ఆకట్టుకుంది.

స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. బాషాకి ముందు.. బాషాకి తర్వాత అనాల్సిందే. సెన్సేషనల్ ఫ్లాష్ బ్యాక్ అనే థీమ్ ని ఇంట్రడ్యూస్ చేయగా.. రెండు దశాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ అనేక సినిమాలు ఇలాంటి స్క్రీన్ ప్లేతోనే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఆ బాషా చిత్రాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి.. 5.1 సరౌండ్ సౌండ్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. అప్పట్లోనే అన్నేసి సంచలనాలకు కేంద్ర బిందువు అయిన బాషా.. ఇప్పుడు డిజిటల్ వెర్షన్ లోనూ సెన్సేషన్ సృష్టిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

మార్చ్ 3న డిజిటల్ బాషా తమిళ్ వెర్షన్ ను రిలజ్ చేయబోతున్నట్లు సత్య మూవీస్ అనౌన్స్ చేసింది. ఒకే సినిమాతో ఒకే తరహా మాయను మళ్లీ రిపీట్ చేయడం కష్టమే కానీ.. బాషా లవర్స్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఈ డిజిటల్ బాషాకు మంచి సపోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,