Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2015 10:56:15
facebook Twitter Googleplus
Photo

తమ ఔదార్యాన్ని ప్రదర్శించడంలో తమిళ హీరోలు ఒకరితో మరొకరు పోటీపడుతుంటారు. తమ స్టాఫ్ కీ, యూనిట్ సభ్యులకి రకరకాల కానుకలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు 'ఇళయదళపతి' విజయ్ కూడా అలాగే తన సినిమాకి పనిచేస్తున్న వారికి సంక్రాంతి కానుకలు పంచాడు. ప్రస్తుతం శింబు దేవన్ దర్శకత్వంలో విజయ్ 'పులి' అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ తలకోన ఫారెస్టులో జరుగుతోంది. యూనిట్ సభ్యులంతా పండగకు కూడా ఇంటికి వెళ్ళకుండా షూటింగులోనే వుండిపోవడంతో, మొత్తం 260 మంది యూనిట్ సభ్యులకు ఒక్కొక్కరికీ ఒక్కో గోల్డ్ కాయిన్, తిరుపతి లడ్డూ కానుకగా ఇచ్చాడట. దీంతో సెట్లోనే వారంతా సంక్రాంతి జరుపుకున్నారు.

,  ,  ,  ,  ,  ,