Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 10:25:52
facebook Twitter Googleplus
Photo

దిగ్గజ దర్శకుడు మణిరత్నం తిరిగి ఫాంలోకి వచ్చేశారని ఇప్పటికే చాలాసార్లు చెప్పేసుకున్నాం. ఓకే బంగారంతో తిరిగి ఇండస్ట్రీకి తన స్టామినా ఏంటో చూపించిన మణిరత్నం.. ఇప్పుడు తన కొత్త సినిమాని కూడా ఫినిష్ చేసేస్తున్నారు. కార్తీ- అదితి రావు హైదరి జంటగా 'కాట్రు వెలియిదాయ్' చిత్రం షూటింగ్ పూర్తి చేసేశారు మణి సార్.

మణిరత్నం అన్ని సినిమాల మాదిరిగానే.. ఇది కూడా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది. పైగా కార్తికి ఇక్కడ మంచి డిమాండ్ ఉండడంతో భారీగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఈ మూవీ తెలుగు వెర్షన్ కు డ్యుయెట్ అనే పేరు ఫైనల్ చేయగా.. ఇప్పుడు కొత్త పోస్టర్ తో పాటు.. కొత్త టైటిల్ ని కూడా అనౌన్స్ చేయడం విశేషం. తాజాగా కాట్రు వెలియిదాయ్ తెలుగు వెర్షన్ కు 'చెలియా' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. తెలుగులో ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు దిల్ రాజు నిర్వహిస్తున్నారు. ఓకే బంగారం తర్వాత మణిరత్నంతో వరుసగా జట్టు కడుతున్నాడు దిల్ రాజు. మణిరత్నం మూవీ సఖి సినిమాలో.. సఖియా.. చెలియా పాట పల్లవి తొలి లైన్ లోంచి ఈ 'చెలియా' తీసుకున్నారని అనుకోవచ్చు.

చెలియా మూవీలో కార్తి ఓ జెట్ ఫైటర్ కి పైలట్ గా కనిపిస్తాడనే టాక్ ఉంది. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోవడంతో.. సరైన డేట్ చూసుకుని ఫిబ్రవరిలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

,  ,  ,  ,  ,  ,