Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 12:29:11
facebook Twitter Googleplus
Photo

మనం సోగ్గాడే చిన్ని నాయనా ఊపిరి వరుస విజయాలతో ఊపుమీదున్న నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఓం నమో వేంకటేశాయా అన్న పేరుతో రూపొందుతున్న ఈ సినిమా 17 శతాబ్ధం లో తిరుపతి వెంకటేశ్వరుని ప్రియ భక్తుని గా కీర్తి పొందిన హథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెకుతున్నది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం అనువైన ప్రదేశాల కోసం చిత్రం బృందం కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అన్వేషించినట్లు తెలిసింది. చివరికి దక్షిణాదిన కర్ణాటక లోని చాలా శీతల ప్రాంతం అయిన చిక్ మగళూర్ అడవులలో కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసినట్టు చెపుతున్నారు. ఈ ప్రదేశాలలో 17 శతాబ్ధం లోని తిరుపతి ని పెద్ద పెద్ద సెట్స్ గా వేసి అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ సినిమాలో సుమన్ ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా నటించనున్నారు.

,  ,  ,  ,  ,  ,