Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2016 11:02:22
facebook Twitter Googleplus
Photo

భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయిన దర్శకుడు మారుతి, విక్టరీ వెంకటేష్‌‍ల క్రేజీ కాంబినేషన్‌లో ప్రస్తుతం ?బాబు బంగారం? పేరుతో ఓ కామెడీ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా వెంకీ స్టైల్లో సాగే కామెడీ సినిమాగా ఉంటుందని మారుతి తెలిపారు. ఇక వెంకటేష్ హీరోగా తన దర్శకత్వంలో కొన్నాళ్ళ క్రితం ప్రారంభమై, అనుకోని కారణాల వల్ల ఆగిపోయిన ?రాధా? సినిమాకు, ?బాబు బంగారం?కు ఎటువంటి సంబంధం లేదని మారుతి స్పష్టం చేశారు.
??బాబు బంగారం? కథ, ?రాధా? కథ ఒక్కటేనా అని చాలా మంది అడుగుతున్నారు. రాధా అప్పుడే పక్కనపెట్టేశా. బాబు బంగారం ఈమధ్య వచ్చిన ఒక ఆలోచనతో పుట్టిన కథ. ఈ రెండు కథలకు సంబంధం లేద?ని మారుతి అన్నారు. వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన బాబు బంగారం సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. జూలై 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,