Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:30:09
facebook Twitter Googleplus
Photo

గతంలో కంటే ఇప్పటి హీరోయిన్లు డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. కేవలం హీరోయిన్లుగానే మిగిలిపోకుండా, సినిమా నిర్మాణంలోకి కూడా దిగుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. జుహీ చావ్లా, అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా వంటి తారలు నిర్మాతలుగా మారిన వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడీ బాటలో తాప్సీ కూడా పయనించడానికి సిద్ధపడుతోంది.


తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 'కాంచన' చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే. తమిళంలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో కలసి దీనిని హిందీలో నిర్మించడానికి తాప్సీ సమాయత్తమవుతోందట.

,  ,  ,  ,  ,