Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 13:17:46
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్లో ఎక్కడ చూసినా విక్రమ్ వేద అనే సినిమా గురించే చర్చ జరుగుతోంది. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ సూపర్ పాజిటివ్ గా వచ్చాయి. ప్రేక్షకుల స్పందనా బాగుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కలెక్షన్లు కూడా అదిరిపోతున్నాయి. జీఎస్టీ దెబ్బకు తమిళనాట టికెట్ల రేట్లు పెరిగిపోవడం.. సినీ పరిశ్రమ చెందిన వివిధ వర్గాలు స్ట్రైకులు చేయడం.. ఇంకా కొన్ని కారణాలతో దాదాపు నెల రోజుల నుంచి కోలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్లుగా నడుస్తోంది. కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇలాంటి టైంలో విక్రమ్ వేద మళ్లీ తమిళ సినిమాలకు ఊపు తెచ్చింది. ముఖ్యంగా టికెట్ల రేట్ల పెంపుతో ఎక్కువ దెబ్బ తిన్న మల్టీప్లెక్సుల్ని మళ్లీ కళకళలాడేలా చేసిందీ సినిమా.

చాలా తక్కువ సమయంలో నటుడిగా మంచి పేరు సంపాదించి.. తనకంటూ ఒక స్టేచర్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి.. చాక్లెట్ బాయ్ గా తనకున్న ఇమేజ్ చెరిపేసుకుని గురు ఒరిజినల్ ఇరుదు సుట్రు తో అందరినీ మెస్మరైజ్ చేసిన మాధవన్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ విక్రమ్ వేద. ఇందులో విజయ్ సేతుపతి క్రిమినల్ పాత్ర పోషిస్తే.. మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించాడు. వీళ్లిద్దరి మధ్య ఎత్తులు పైఎత్తులతో సాగే సినిమా ఇది. రసవత్తరమైన కథాకథనాలకు తోడు విజయ్ సేతుపతి.. మాధవన్ ల పెర్ఫామెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అంటున్నారు. భార్యాభర్తలైన గాయత్రి-పుష్కర్ అనే దర్శక ద్వయం ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాపై మన తెలుగు నిర్మాతల కళ్లు పడ్డట్లు సమాచారం. దీన్ని ఎవరితో రీమేక్ చేస్తే బాగుంటుందని చర్చలు నడుస్తున్నాయట.

,  ,  ,  ,