Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2016 12:44:02
facebook Twitter Googleplus
Photo

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువహీరో రాజ్ తరుణ్, ?ఈడో రకం ఆడో రకం? లాంటి మంచి సమ్మర్ హిట్ తర్వాత రెండు కొత్త సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒకటి దర్శకుడు మారుతి నిర్మించనుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి మారుతి నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంజన దర్శకత్వం వహిస్తున్నారు. రాజుగాడు అన్న టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా నేడు సెట్స్‌పైకెళ్ళింది. మారుతి స్వయంగా స్క్రిప్ట్ సమకూర్చిన ఈ కామెడీ సినిమాకు ?యమా డేంజర్? అన్నది ట్యాగ్‌లైన్.
ఇక సినిమా సెట్స్‌పైకెళ్ళిన సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో తాను విన్న స్క్రిప్ట్‌లలో బెస్ట్ స్క్రిప్ట్ ఇదని, మారుతి బ్రాండ్ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఇక మారుతితో కలిసి సినిమా నిర్మించడం సంతోషంగా ఉందని అనిల్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,