Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Apr-2015 11:07:50
facebook Twitter Googleplus
Photo

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డైనమైట్' క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతోంది. దేవా కట్టా దర్శకత్వంలో ఇది రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న జేడీ చక్రవర్తి, విష్ణులతో బాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఈ భారీ యాక్షన్ దృశ్యాలను హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో చిత్రీకరిస్తున్నారు. వీటికి విజయ్ మాస్టర్ యాక్షన్ కోరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రీకరణతో టాకీ పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రణీత కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,