Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jan-2016 18:03:37
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసేయడం.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలకు అలవాటుగా మారిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మొదలైన ఈ రచ్చ.. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అన్ని సినిమాల్లోనూ కాకపోయినా తనకు నచ్చినవాటిని సిట్యుయేషన్ కుదిరితే మాత్రం సెట్ చేసేస్తుంటాడు చెర్రీ. చరణ్ అంతగా కాకపోయినా అడపాదడపా స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇలా రీమిక్స్ లకు సై అంటూనే ఉంటాడు.

ఇక లేటెస్ట్ గా మెగా సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్ అయితే... ప్రతీ సినిమాలోనూ ఓ రీమిక్స్ తో కుమ్మేస్తున్నాడు. నడక నడత అన్నింటిలోనూ మెగాస్టార్ ని గుర్తు చేస్తూనే ఉన్నాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఒక వేళ వీళ్లందరికీ ఒకే పాట కావలిసి వస్తే అప్పుడేం చేస్తారు అన్నది ప్రశ్న. అఫ్ కోర్స్.. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లెం వస్తే.. రామ్ చరణ్ కే ఎక్కువ రైట్స్ ఉంటాయనుకోండి. ఒకవేళ చెర్రీనే త్యాగం చేయాలనుకుని ఎవరికి ఇవ్వాలని భావిస్తే వారికి ఇచ్చేయచ్చు. కానీ అసలు ఇంతగా సమస్య రాకపోవచ్చు. ఎందుకంటే.. చిరు స్టార్ గా ఎదిగనప్పటి నుంచి బోలెడన్ని సినిమాలు చేశారు. 149 సినిమాలంటే.. అన్నింటిలోనూ కలిపి సూపర్ హిట్ సాంగ్స్ వరకే లెక్కపెట్టినా కనీసం 150 వచ్చేస్తాయి. ఇది చాలా చిన్న సంఖ్య అనే అనాలి.

ఎందుకంటే ఓ సమయంలో.. మెగాస్టార్ మూవీలోని అన్ని సాంగ్స్ టాప్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో.. కనీసంలో కనీసం 150 పాటలయినా రీమిక్స్ చేసేసుకోవచ్చన్న మాట. వీటి వరకే లిస్ట్ చేసి కంప్లీట్ చేయాలని అనుకున్నా.. ఈ హీరోలందరికి కలిపినా చాలా కాలమే పడుతుంది కదా.. సో నో ప్రాబ్లెం.

,  ,  ,  ,