Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 11:27:53
facebook Twitter Googleplus
Photo

హీరో- హీరోయిన్ కాంబినేషన్ సక్సెస్ అయితే.. ఆ కాంబోను రిపీట్ చేయడం కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో చాలానే హిట్ పెయిర్స్ కనిపిస్తాయి. కానీ యంగ్ హీరో నితిన్ - కొత్తమ్మాయి మేఘా ఆకాష్ ఈ విషయంలో కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేయనున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న లై చిత్రంలో నటిస్తున్నారు. అమెరికాలో సుదీర్ఘ కాలం.. అంటే రెండు నెలలకు పైగా షూటింగ్ చేసుకున్న చిత్రంగా ఈ మూవీ రికార్డ్ సృష్టించనుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబో కొనసాగనుంది. ఈ నెల చివర్లో నితిన్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ లు నిర్మాతలుగా మారి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాయి. ఇప్పుడీ సినిమాలోకి కూడా మేఘా ఆకాష్ నే ఫైనల్ చేశారని తెలుస్తోంది. మోడల్ నుంచి యాక్ట్రెస్ గా మారిన ఈ భామకు ఇది లక్కీ ఆఫర్ అనాల్సిందే.

ఇప్పటికే మేఘా ఆకాష్ కి ఆమె పాత్రకు సంబంధించి నెరేషన్ ఇవ్వడం.. ఆమె ఒప్పుకోవడం.. అగ్రిమెంట్స్ సైన్ చేయడం కూడా పూర్తయిపోయాయట.

,  ,  ,  ,  ,