Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 12:09:45
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు మెహర్ రమేష్ ఎప్పుడైతే మహేష్ బాబును ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ యాడ్ కోసం డైరక్ట్ చేశాడో.. వెంటనే లైమ్ లైట్ లోకి వచ్చేశాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే మెహర్ కు ఛాన్సిచ్చే ఆ హీరోలు ఎవరు?

నిజానికి మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి చుట్టాలు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి.. దూరపు వరుస పిన్నికి సొంత కుమారుడు. పైగా పవన్ కళ్యాణ్ తో కలసి పెరిగాడు మెహర్. ఓవర్ సీస్ లో ఉద్యోగం చేసి.. ఆ డబ్బులతో విజయవాడలో బిలియర్డ్స్ టేబుల్స్ తయారు చేసి అమ్ముకునే బిజినెస్ పెట్టాడు. బాగానే సంపాదించాడు. అయితే సినిమాల్లో మాత్రం.. స్టయిలిష్ గా సినిమాలు తీస్తాడు కాని.. కథ కాకరకాయి అనే అంశాలను గాల్లో దీపం టైపులో వదిలేస్తుంటాడు. అయితే ఈ మధ్యన తమకు నచ్చిన కథలను విరివిగా కొనేస్తున్న మెగా హీరోలు.. ఏదో ఒక ప్రాజెక్టు ద్వారా మెహర్ రమేష్ ను పట్టాలెక్కించాలని చూస్తున్నారట.

కంత్రి.. బిల్లా.. శక్తి.. షాడో.. వంటి కళాకండాలు తెరకెక్కించాక.. మెహర్ పేరు చెబితే ఎవరైనా భయపడతారు మరి. అందుకే మనోడు సొంత ఫ్యామిలీ హీరోలనే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ కు ఒక కథ చెప్పి ఒప్పించాడని ఫిలిం నగర్ కోయిలలు కృష్ణా నగర్ లో కూస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,