Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2015 13:32:11
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ తన రీ-ఎంట్రీ విషయంలో నందమూరి బాలకృష్ణ ఇచ్చిన లిఫ్టును జీవితంలో మర్చిపోలేనని చాలాసార్లు చెప్పింది హీరోయిన్ సోనాల్ చౌహాన్. అమ్మడు అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి వచ్చినా అస్సలు ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని 'లెజండ్' సినిమాలో బికినీ లుక్ తో ఇచ్చిన ఎంట్రీ కారణంగా.. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ లేదా స్పెషల్ గ్లామరస్ రోల్ ఒకటి వేయాలంటే మాత్రం.. ముందుగా ఈమెనే పిలుస్తున్నారు.

ఈ మధ్యకాలంలో సైజ్ జీరో వంటి సినిమాతో పంచ్ తినేసిన సోనాల్.. ఇప్పుడు బాలయ్యతో కలసి రెండోసారి రచ్చ చేయడానికి రెడీ అయిపోతోంది. అంతేనా.. ఫ్యాన్సును రెచ్చగొట్టడానికి కూడా సిద్దంగా ఉన్నట్లుంది. ఆడియో రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేసిన కొన్ని పోస్టర్లలో అమ్మడు బికినీ టాప్ లో దర్శనిమిస్తోంది. అవి చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్. పైగా ఏదో బీచ్ సాంగ్ కు చెందిన స్టిల్స్ అనుకుంట.. బాలయ్య కూల్ గా పాప హాట్ గా కనిపిస్తున్నారు. సో.. మరోసారి బికినీ వేసింది కాబట్టి.. సినిమా హిట్టవ్వడం గ్యారంటీ అంటూ అభిమానులు ఆశిస్తున్నారు మరి.

,  ,  ,  ,