Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2016 16:32:02
facebook Twitter Googleplus
Photo

కొందరు హీరోయిన్ల పేర్లు వినగానే మనకు కొన్ని రకాల గెటప్సే గుర్తుకొస్తాయి. అలా తమన్నాను తలుచుకుంటే ఆమె ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సుల్లోనే గుర్తుకొస్తుంది. ఆమె చేసినవన్నీ కూడా దాదాపు మోడర్న్ అమ్మాయి పాత్రలే. చీర కట్టడం.. పద్ధతైన ఇల్లాలిగా కనిపించడం.. ఇప్పటిదాకా తమన్నా కెరీర్లో లేదనే చెప్పాలి. ఐతే ఓ తమిళ సినిమా కోసం సడెన్ గా అవతారం మార్చేసింది మిల్కీ బ్యూటీ. నిండుగా చీర కట్టుకుని ఓ మిడిల్ క్లాస్ ఇల్లాలిలా తయారైంది తమ్మూ.

మిల్కీ బ్యూటీని ఇలా తయారు చేసింది శీను రామస్వామి అనే తమిళ డైరెక్టర్. ?ధర్మదురై? అనే సినిమాలో తమన్నా ఈ చిత్రమైన అవతారంలో కనిపించనుంది. షాట్ గ్యాప్ లో తమ్మూ సిన్సియర్ గా సీన్ పేపర్ చదువుకుని తర్వాతి సన్నివేశం కోసం సన్నద్ధమవుతున్న తీరు చూసి ముగ్ధుడైపోయిన డైరెక్టర్.. ఆమె ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేసి తన డెడికేషన్ గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఇటీవలే విడుదలైన ధనుష్ సినిమా ?నవ మన్మథుడు?లో సమంత కూడా ఇలాంటి పద్ధతైన ఇల్లాలి అవతారంలోనే కనిపించిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ?ధర్మదురై? కోసం తమ్మూ తన పారితోషకాన్ని కూడా బాగా తగ్గించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి అంత ప్రత్యేకత ఆమె క్యారెక్టర్లో సినిమాలో ఏముందో మరి.

,  ,  ,