Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jun-2016 10:35:43
facebook Twitter Googleplus
Photo

సీనియర్ హీరోయిన్ అనిపించుకునే ఏజ్ వచ్చాక త్రిష థాట్స్ లో చాలానే మార్పులొచ్చాయి. అంతకముందు స్కిన్ షో అంటే అబ్బెబ్బే అనే టైపు ఈ చెన్నై బ్యూటీ. ఇప్పుడు మాత్రం బికినీలో కూడా అందాలు ఆరబోసేస్తోంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన అరణ్మణై2.. అదేనండీ తెలుగు కళావతిలో బికినీ వేసి కాసేపు కనిపించింది త్రిష. మాజీ లవర్ సిద్ధార్ధ్ తో కలిసి బీచ్ సాంగ్ లో బాగానే వయ్యారాలు ఒలకబోసింది. ఆ బికినీ అంతగా కలిసిరాకపోయినా.. ఇంకా ఆ సోకులను మాత్రం కంటిన్యూ చేస్తోంది త్రిష.

కళావతి దెయ్యాల సినిమానే కాగా.. ప్రస్తుతం చేస్తున్న నాయకి కూడా అదే టైపు. హారర్ కామెడీ జోనర్ లోనే తెరకెక్కింది. ఇందులో చాలా రకాల గెటప్స్ లో కనిపిస్తున్న త్రిష.. బికినీ సంగతి మాత్రం ఇంకా తేల్చలేదు. ఇప్పుడు మరో దెయ్యం సినిమా కూడా మొదలుపెట్టేసిన చెన్నై బ్యూటీ.. ఇందులో చాలా భయంకరంగా భయపెట్టేస్తుందిట. మోహిని అనే టైటిల్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా బికినీ సోకులను బయటపెట్టనుంది త్రిష.

అంతకంటే స్పెషల్ ఏంటంటే.. త్రిష బికినీ వేసుకుని ఆడియన్స్ కు అందాలు పంచుతున్న టైంలోనే.. ఈమె కిడ్నాప్ జరుగుతుందని తెలుస్తోంది. అంటే ఆ బికినీలో చాలా సేపు తెరపై కనిపించేలా ప్లాన్ చేశారన్న మాట. ఇంతకీ ఈ కిడ్నాప్ తతంగం అంతా న్యూయార్క్ లో షూట్ చేయాలని ప్లాన్ చేశారు. మొత్తానికి త్రిష దెయ్యాల సినిమాలకి బికినీకి లింక్ బాగానే ఉన్నట్లుంది.

,  ,  ,  ,  ,  ,